Mahabubabad: ప్రేమ తెచ్చిన తంటా.. పలువురి పై కేసు నమోదు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో దారుణం. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో గడ్డివాముకు నిప్పు పెట్టి, రూ. 7 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 5:27 PM IST
Mahabubabad
X

Mahabubabad: ప్రేమ తెచ్చిన తంటా.. పలువురి పై కేసు నమోదు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ శివారు వాగ్య తండా H/o గుండెంగా గ్రామానికి చెందిన తేజావత్ ఉమ్లా తండ్రి మంజ్య గారు తేదీ 06.04.2026 న ఉదయం సమయంలో ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో, కొంతమంది వ్యక్తులు ఇంటి ముందు వచ్చి ప్రేమ విషయంలో నిరసన వ్యక్తం చేసినారు.

అనంతరం తేదీ 07.04.2026 న తెల్లవారుజామున సుమారు 04.00 గంటల ప్రాంతంలో తెలియని వ్యక్తులు గడ్డివాము కు నిప్పు పెట్టి, ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు రూ.7,00,000/- మరియు బంగారు చైన్‌ను అపహరించినారు.

గడ్డివాము దహనం వల్ల సుమారు రూ.10,000/- నష్టం జరగగ, ఇట్టి సంఘటన పై తేజావత్ ఉమ్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించబడుతోంది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ బి. గిరిధర్ రెడ్డి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story