Rachoor: ప్రభుత్వ రోడ్డు తనదంటాడా?.. అధికారులకు సర్పంచ్ మొర!
Rachoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రచూర్ గ్రామంలో రోడ్డు వివాదంపై సర్పంచ్ లోఖండే ఆకాష్ అధికారులను ఆశ్రయించారు.
Rachoor: ప్రభుత్వ రోడ్డు తనదంటాడా?.. అధికారులకు సర్పంచ్ మొర!
Rachoor: రచూర్ (కామారెడ్డి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కందరపల్లి 161 జాతీయ రహదారి కి కొద్దిపాటి దూరంలో ఉన్న రచూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళే దారి విషయం లో ఎలాంటి వివాదానికి చోటు లేకుండా శాశ్వత పరిష్కారం చెయ్యాలని ఆ గ్రామ సర్పంచ్ లోఖండే ఆకాష్ తన అభ్యర్థనను అధికారుల ముందు మొరపెట్టుకున్నాడు.
తనపై నమ్మకం తో గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకున్నారని ఎన్నుకున్నాక గ్రామంలోని ఓ రహదారి విషయంలో రోజురోజుకు వివాదంగా మారుతుందని దిని పరిష్కరించాలని సర్పంచ్ మండల అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సంభందిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులకు కోరారు.
రహదారి విషయంలో గ్రామానికి చెందిన ఓ పలుకుబడి గల వ్యక్తి రహదారి తోపాటు సి సి రోడ్డు సైతం తనదే నంటు వివాదం సృష్టించాడని ప్రభుత్వ నిధులతో నిర్మించిన సి సి రోడ్డు తనదే అనడం విడ్డూరంగా ఉందని మండల స్థాయి అధికారులు పరిష్కార మార్గం కనుగొని రాబోయే రోజుల్లో గ్రామస్థులకు దారి విషయంలో ఎలాంటి వివాదం రాకుండ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.
దారి విషయంలో పోలీస్ స్టేషన్ వరకు చేరిన వైనం.
గత నెల రోజుల క్రితం దారి తనదే నంటె తనది అంటు దారికి అడ్డంగా రాళ్లు వేసి గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బంది కల్గించిన విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వివాద పరిష్కారం కోసం మద్నూర్ ఎంపిడిఓ, తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం సమర్పించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
నిత్యం అవసరాల కోసం గ్రామస్థులు గ్రామ పంచాయతీ కి వెళ్ళే దారి స్థలం తనదే అనడనికి ప్రభుత్వం ద్వార సంబంధిత సర్వేయర్ తో కొలతలు చేయించుకొండంటు దారిపై వెళ్లే వారికి అడ్డుపడితే గ్రామస్థులకు మధ్య వివాదం ఏర్పడే ఆస్కారం ఉంటుందని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు గాను సహకరించాల్సి పోయి రహదారి కి అడ్డంగా రాళ్లు వెయ్యడం వివాదానికి దారి తీసే అవకాశం ఉందని అలాంటి వివాదం రాకుండ అధికారులు పరిష్కారం చూపి గ్రామం లో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




