Mahalakshmi LPG Scheme: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. మరో 5 లక్షల కుటుంబాలకు మహాలక్ష్మి పథకం వర్తింపు!
Mahalakshmi LPG Scheme: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
Mahalakshmi LPG Scheme: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. మరో 5 లక్షల కుటుంబాలకు మహాలక్ష్మి పథకం వర్తింపు!
Mahalakshmi LPG Scheme: తెలంగాణ ప్రభుత్వం తన ఆరు గ్యారెంటీల్లో భాగమైన 'మహాలక్ష్మి' పథకం కింద రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించే సదుపాయాన్ని మరిన్ని కుటుంబాలకు విస్తరించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. పౌరసరఫరాల శాఖ నిర్వహించిన తాజా పరిశీలనలో మరో 5 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకానికి అర్హులని గుర్తించింది.
కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. నిధుల విడుదల మరియు ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే కొత్త లబ్ధిదారులకు రూ. 500 కే సిలిండర్ సబ్సిడీ వర్తింపజేయనున్నారు.
ఫిబ్రవరి 2024 లో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన జీవో జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించి పథకాన్ని అమలు చేయగా, తాజాగా మిగిలిన దరఖాస్తులను పరిశీలించి కొత్త లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.




