Mahabubabad: రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించం.. కలెక్టర్ స్నేహ శబరీష్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కేసముద్రం మార్కెట్లో పర్యటించారు.
Mahabubabad: రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించం.. కలెక్టర్ స్నేహ శబరీష్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. మార్కెట్ ఆవరణ లో కలియ తిరుగుతూ మొక్కజొన్నల కొనుగోలు ను పరిశీలించారు. మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. క్కజొన్నల కొనుగోలు లో జాప్యం ఎందుకు జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ కు వచ్చిన మొక్కజొన్న లను వెంట వెంటనే కొనుగోలు చేసి తరలించాలని, రైతుకు సంబంధించిన వివరాలను మార్క్ ఫెడ్ సంబంధిత శాఖలు సమన్వయం తో పని చేసి ఎలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మార్కెట్ లో అంతర్గత సిబ్బంది, హమాలీలను పెంచుకొని వెంటనే కాంటావేసి, లోడింగ్ చేయాలని,
అవసరం ఉన్న చోట మక్కల కొనుగోళ్ల కేంద్రాలకు ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారని సరిత , మార్కెట్ కమిటీ సెక్రటరీ , మార్క్ హెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




