Mahabubabad: మున్సిపాలిటీకి చెత్త సెగ.. 21వ వార్డు వాసుల వినూత్న నిరసన!
Mahabubabad: మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 21వ వార్డు వాసులు చెత్త పోసి నిరసన తెలిపారు.
Mahabubabad: మున్సిపాలిటీకి చెత్త సెగ.. 21వ వార్డు వాసుల వినూత్న నిరసన!
మహబూబాబాద్ జిల్లా: వార్డు కు చెత్త ట్రాక్టర్ రావడం లేదని లేదని ఆగ్రహించిన వార్డు వాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్త సంచులు, చెత్త బుట్టల తో నిరసన వ్యక్తం చేసి.. మున్సిపల్ కార్యాలయం లో చెత్త ను పోసి కమిషనర్ తో వాగ్వాదానికి దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయం లో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 21 వ వార్డు కు గత కొన్ని రోజులుగా చెత్త ట్రాక్టర్ రావడం లేదు. ఈ విషయాన్ని పలు మార్లు మున్సిపల్ సిబ్బందికి విన్నవించుకున్నారు. ఆ వార్డుకు వచ్చే ట్రాక్టర్ చెడిపోవడంతో, మరో వార్డుకు చెందిన ట్రాక్టర్ ను కొన్ని రోజులుగా మధ్యాహ్నం, సాయంత్రం వేళ వార్డుకు పంపించారు. ఆ సమయం లో ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో ప్రతి ఇంట్లో చెత్త పోరుకపోతుంది, వారం రోజులుగా మధ్యాహ్నం వచ్చే చెత్త ట్రాక్టర్ కూడా రాకపోవడంతో ఆగ్రహించిన వార్డు కౌన్సిలర్ జరీనా బేగం, తన భర్త జాకీర్, మరి కొంత మంది వార్డు వాసులతో చెత్త బుట్టలు చేత పట్టుకుని మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, కార్యాలయం లోని కమిషనర్ చాంబర్, పలు రూమ్ లలో చెత్తను పోశారు. వెంటనే కమిషనర్ తన ఛాంబర్ లోని చెత్తను స్వయం గా కమిషనర్ రాజేశ్వర్ చెత్త ను ఎత్తి బయట పోయడం విశేషం. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ హామీని ఇవ్వడం తో వార్డు వాసులు శాంతించారు.




