Mahabubabad: పిల్లలకు కూడా హెల్మెట్ మస్ట్.. జిల్లా ఎస్పీ కీలక సూచన

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' ర్యాలీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 April 2026 4:48 PM IST
Mahabubabad
X

Mahabubabad: పిల్లలకు కూడా హెల్మెట్ మస్ట్.. జిల్లా ఎస్పీ కీలక సూచన

Mahabubabad: ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు 5 సంవత్సరముల లోపు పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హెల్మెట్ వినియోగం పై పోలీసులు రవాణా శాఖ ఆధ్వర్యం లో చేపట్టిన

ద్విచక్ర వాహనాల ర్యాలీ ని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీ లో పాల్గొన్నారు. పట్టణం లోని ప్రధాన రహదారుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, అరైవ్ అలైవ్ కేవలం నినాదం కాదని, వాహన దారులు సురక్షితంగా ఇంటికి చేరాలనే సామాజిక బాధ్యతను గుర్తు చేసే అవగహన కార్యక్రమమని, ఇందులో విద్యార్థిని, విద్యార్థులను భాగస్వాములను చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డీస్పి తిరుపతి రావు, జిల్లా పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story