Mahabubabad: జన గణన తొలి దశ.. ఇళ్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జన గణన 2027పై ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Mahabubabad: జన గణన తొలి దశ.. ఇళ్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
Mahabubabad: జన గణన 2027 పై క్షేత్ర స్థాయిలో జనాబా, ఇళ్ల లెక్కింపులో కీలక పాత్ర పోషించే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో శిక్షణ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మూడు రోజులకు ఒక బ్యాచ్ కి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్బంగా మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి ( ఎం.పీ.ఎస్. ఓ ) బాగ్యశ్రీ మాట్లాడుతూ.. మండలంలోని 15 రెవిన్యూ గ్రామాలలో జనగణకార్యక్రమాన్ని104 మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు చేపట్టనున్నారు. 104 మందిని 3 బ్యాచ్ లుగా విభజించి 131 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ జన గణన ప్రక్రియ చేపట్టనున్నారు. మే 1 నుంచి తొలి దశలో ఇళ్ల లెక్కింపు, 2వ దశలో జనబాను లెక్కించనున్నారు.స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓ ల సారథ్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుందన్నారు.
Next Story




