Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు..
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ కిషన్‌బాగ్‌లోని ఓ సోఫా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు..
Hyderabad: పాతబస్తీ బహదూర్‌పురా పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక సోఫా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు తయారీ కేంద్రం అంతటా విస్తరించడంతో ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తయారీ కేంద్రంలో సోఫాల తయారీకి ఉపయోగించే ఫోమ్, కలప, గుడ్డ వంటి వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
సోఫా తయారీ కేంద్రం చుట్టుపక్కల జనావాసాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.




