Cordial Meeting: మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

Cordial Meeting: మాల విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 15న ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించనున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 March 2026 8:16 PM IST
Cordial Meeting: మాల విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించనున్నారు
X

Cordial Meeting

Cordial Meeting: ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలల సెమినార్ హాల్లో మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని మాల విద్యార్థి జేఏసీ నాయకులు రాహుల్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ, హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు చెప్పారు.

రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలని కోరారు.విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పనలో పాలు పంచుకోవాలని కోరారు.

రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story