Kushaiguda: కుషాయిగూడ కోర్టు పరిధిలోకి అల్వాల్, జవహర్‌నగర్ పీఎస్-లు?
Kushaiguda: జవహర్‌నగర్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లను కుషాయిగూడ కోర్టు పరిధిలోకి చేర్చాలని జస్టిస్ కె. లక్ష్మణ్‌కు మల్కాజిగిరి బార్ అసోసియేషన్ విన్నపం.
Kushaiguda: కుషాయిగూడ కోర్టు పరిధిలోకి అల్వాల్, జవహర్‌నగర్ పీఎస్-లు?
Kushaiguda: జవహర్‌నగర్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లను కుషాయిగూడ కోర్టు పరిధిలోకి చేర్చాలని మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రత్తయ్య విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సోమవారం పోర్ట్‌ఫోలియో జడ్జి కె. లక్ష్మణ్ ను కలిసి పలు ముఖ్య సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధానంగా జవహర్‌నగర్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లను కుషాయిగూడ కోర్టు పరిధిలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కోర్టు అవసరాల కోసం రెండు ఎకరాల భూమి మార్పిడి, కుషాయిగూడ కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడం, నేరేడ్ మేట్‌లో కొత్త కోర్టు భవనం నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుతం అధికార పరిధిలో జవహర్‌నగర్ ప్రాంతం మాత్రమే ఎంఎండీసీ పరిధిలోకి వస్తుండగా, న్యాయపరమైన వ్యవహారాల కోసం మేడ్చల్ కోర్టుకు వెళ్లాల్సి రావడం వల్ల వ్యాజ్యదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జవహర్‌నగర్ నుంచి మేడ్చల్ కోర్టు దూరం సుమారు 19.1 కిలోమీటర్లు కాగా, అల్వాల్ నుంచి 12.9 కిలోమీటర్లు ఉండటం వల్ల ప్రయాణం భారమవుతుందని వివరించారు. అయితే కుషాయిగూడ కోర్టు ఈ రెండు పోలీస్ స్టేషన్‌లకు మరింత సమీపంలో ఉండటం వల్ల కేసులను కుషాయిగూడ కోర్టుకు మార్చడం ద్వారా ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరమైన ప్రతిపాదనలు సమర్పించడంతో పాటు వ్యక్తిగతంగా వివరించినట్లు చెప్పారు.
కుషాయిగూడ కోర్టులో తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు రత్తయ్య పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జవహర్‌నగర్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లను కుషాయిగూడ కోర్టు పరిధిలోకి తక్షణం చేర్చేలా ప్రభుత్వం అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని మల్కాజిగిరి బార్ అసోసియేషన్ తరఫున రత్తయ్య విజ్ఞప్తి చేశారు.
బార్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తావించిన పలు సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు హరికృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు ప్రసన్న, సంయుక్త కార్యదర్శి రవి శంకర్, మహిళా సంయుక్త కార్యదర్శి జలజ, కోశాధికారి పుణ్యరాజు, లైబ్రరీ సెక్రటరీ సాయినాథ్ గౌడ్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా పవన్ కుమార్ బిఎన్, లేడీ రిప్రెజెంటేటివ్ సుజాత, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవనీత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బద్రీనాథ్, రాకేష్ ఎన్, నరేందర్, నరేష్, శోభా రాణి, విమల తదితరులు పాల్గొన్నారు.




