Mallu Ravi: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులపై ఎంపీ మల్లు రవి స్పష్టత!
Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, చిన్నా రెడ్డి వివరణలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Mallu Ravi: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులపై ఎంపీ మల్లు రవి స్పష్టత!
Mallu Ravi: మల్లు రవి క్రమశిక్షణ కమిటి చైర్మన్ ఎంపీ మల్లు రవి. కొండా సురేఖ కు మేము ఇచ్చిన నోటీస్ కు వారు రిప్లై ఇచ్చారు.కొండా సుష్మిత మాట్లాడిన విడియో లు మేము చూసాము. కొండా సుష్మిత ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నిన్న కొంత మంది ఎమ్మెల్యేలు మాకు కొండా సుష్మిత పై పిర్యాదు చేస్తామని చెప్పారు. మరొక సారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. చిన్నా రెడ్డి కి మేము ఇచ్చిన నోటీస్ కు మాకు రిప్లై ఇచ్చారు..ఆ వివరణ కూడా మేము చదివాము. చిన్నా రెడ్డి మాట్లాడిన మాటలు కూడా విడియో ద్వారా విన్నాము. మేఘా రెడ్డి తో ఒక సారి మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము.
మొన్న ఆదిలాబాద్ లో జరిగిన pac మీటింగ్ లో కంది శ్రీనివాస్ రెడ్డి,సంజీవ రెడ్డి మధ్య జరిగిన గొడవ పై కూడా మాకు వచ్చిన సమాచారం మేరకు ఇద్దరికి నోటీస్ లు ఇచ్చాము.dcc తో మరింత సమాచారం మాట్లాడి తీసుకుంటాము.
జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఒక మహిళ మీద కులం పేరుతో దూషణ చేయడం తో అక్కడ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేశారు అందుకే క్రమశిక్షణ కమిటి విడియో లు ఆడియో లు పరిశీలించి నిర్ణయం తీసుకుంది. మా క్రమశిక్షణ కమిటి కి ఎవరి పై ప్రేమ లేదు ద్వేషం లేదు మాకు పార్టీ మీద ప్రేమ. మాకు పిర్యాదు చేస్తేనే నోటీస్ లు ఇస్తాము.




