Mancherial: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు!
Mancherial: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిన్నయ్య, దివాకర్‌రావు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
Mancherial: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు!
Mancherial: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బాల్క సుమన్ ఈ కార్యక్రమంలో తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




