Mancherial: మదమర్రి టోల్‌గేట్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

Mancherial: మంచిర్యాల జిల్లా మదమర్రి టోల్‌ గేట్‌ దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 10:39 AM IST
Mancherial
X

Mancherial: మదమర్రి టోల్‌గేట్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మదమర్రి టోల్‌ గేట్‌ సమీపంలో ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌తో పాటు కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బస్సు కొత్తగూడెం నుండి బెల్లంపల్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రాత్రి వేళ ప్రయాణం కావడం, డ్రైవర్‌ ఒక్కసారిగా నిద్రలోకి జారుకోవడంతోనే బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story