Medak: రాత్రి 11 దాటితే షాపులు బంద్.. డీఎస్పీ ఆదేశం!

Medak: మెదక్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 3:36 PM IST
Medak
X

Medak: రాత్రి 11 దాటితే షాపులు బంద్.. డీఎస్పీ ఆదేశం!

మెదక్: డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం అయిన ఒక ప్రక్కన విద్యలు చేస్తూ మెదక్ డివిజన్ ప్రాంతంలోభద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు.ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story