Medak: మేధావుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు.. ఎంపీ ఫైర్
Medak: కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.
Medak: మేధావుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు.. ఎంపీ ఫైర్
Medak: నక్సల్స్ ఏరివేతలో 99% కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం నరసాపూర్ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం హైదరాబాద్ నగరంలో కొంతమంది మేధావులను అనుకునేవారు కేంద్ర హోం శాఖ మంత్రి అమీషాను కించపరిచే విధంగా మాట్లాడడమే కాకుండా ఆయనపై కేసులు నమోదు చేయాలనడం సరికాదని అన్నారు.
తమకు తాముగా మేధావులమని ఊహించుకుని కొంతమంది మీడియాలో రావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సమాజంలో యువతను నక్సయిలిజం వైపు మళ్ళించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారే అర్బన్ నక్సలైట్లని అన్నారు. సమావేశంలో బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.
Next Story




