Medak: మెదక్ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక ప్రచారం!
Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు. 'అరైవ్ అలైవ్' పేరుతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన రథం ప్రారంభం.
Medak: మెదక్ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక ప్రచారం!
మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనుందని, ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే జంక్షన్‌లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారని, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు. అదే సమయంలో సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణం, ఓవర్‌లోడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కూదుపేసే ప్రమాదమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణరక్షణకు అత్యవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. అవగాహనతో పాటు నియమాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎఆర్ డియస్పి రంగా నాథ్, సీఐ లు మహేష్, జర్జ్, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, సిబ్బంది పాల్గొన్నారు.




