Medchal: రాజబొల్లారంలో యథేచ్ఛగా ప్రభుత్వ నక్ష రోడ్డు కబ్జా దారి మళ్లింపు

Medchal: మేడ్చల్ మండలం రాజబొల్లారంలో ప్రభుత్వ నక్ష రోడ్డును కబ్జా చేసి దారి మళ్లిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 1 Oct 2026 9:51 AM IST
Medchal
X

Medchal: రాజబొల్లారంలో యథేచ్ఛగా ప్రభుత్వ నక్ష రోడ్డు కబ్జా దారి మళ్లింపు

Medchal: రాజబొల్లారం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 374,375లో నక్షబాట రోడ్డును పట్ట పగలే కొంతమంది ప్రయివేటు వ్యక్తులు దర్జాగా కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 374,375 లో నక్షబాట రోడ్డును కొంతమంది ప్రయివేట్ వ్యక్తులు తమ అవసరాల కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతూ యదేచ్చగా కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నక్ష రోడ్డును కబ్జా చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.నక్ష బాట రోడ్డుకు అడ్డంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతూ నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లిస్తున్నా రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్,ఎంపీ ఈటల రాజేందర్,తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

రాజబోల్లారంలోని సర్వే నంబర్ 374,375లో ఉన్న నక్షా రోడ్డును కొంతమంది ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్బర్జాపేట గ్రామస్తులు గతంలో మేడ్చల్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్,స్థానిక ఎంపీ ఈటల రాజేందర్,మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశారు.దీంతో సదరు అక్రమణదారులు కొంతకాలం నక్ష రోడ్డు కబ్జా పనులను నిలిపివేశారు.

ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న నక్షబాటకు సంబంధించి అధికారులు స్థల పరిశీలన చేసి,అధికారిక సర్వే నిర్వహించి,అసలు అలైన్‌మెంట్‌ను నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.బాటను ఎవరైనా ఆక్రమించినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నారు

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL