Jangaon: జనగామలో విజయవంతంగా ముగిసిన భారీ శస్త్రచికిత్స

Jangaon: జనగామ రవళి నర్సింగ్ హోమ్‌లో విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స. మహిళ కడుపు నుంచి 5 కిలోల భారీ కణతిని తొలగించిన వైద్యులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 April 2026 9:58 AM IST
Jangaon
X

Jangaon: జనగామలో విజయవంతంగా ముగిసిన భారీ శస్త్రచికిత్స

జనగామ జిల్లా: కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ రవళి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో కరీంనగర్ జిల్లా చెందిన చంద్రగిరి ఉమా భర్త పేరు సంతోష్ కుమార్ వయసు 44 సంవత్సరాలు గత కొద్దిరోజుల నుండి కడుపునొప్పితో బాధపడుతూ పర్యవేక్షణలో ఉమా అని పేషెంట్ చూసి అన్ని స్కానింగ్ రిపోర్టులు బ్లడ్ టెస్ట్ లు ఈసీజీ ఎక్స్రేలో చేసిన తర్వాత కణతి ఉన్నదని స్కానింగ్ రిపోర్ట్ లో తెలియపరచడం జరిగింది.

వెంటనే ఆపరేషన్ చేసి కణతి తీయాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది,. ఈరోజు ఈరోజు ఉదయము ఉమా అని పేషంటు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి దాదాపు నాలుగు గంటల సమయం కడుపులో నుండి కణతి తొలగించడం జరిగింది. డాక్టర్ సిహెచ్ రాజమౌళి సార్ ఎమ్మెస్ సర్జన్ మరియు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మరియు డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ రఘు అనుస్తిస్థియ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి 5 కిలోల కణతి బయటికి తీయడం జరిగింది

ఆపరేషన్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ అసిస్టెంట్ అలిసేరి శ్రీనివాస్, అల్వాల రమేష్, మోర్తాల ప్రభాకర్, కుంట మల్లేష్, సిద్దు మరియు సిస్టర్స్ సరోజినీ, రాధా స్టాఫ్ అందరు పాల్గొనడం జరిగింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story