Gangadhara: మార్కెట్ యార్డులో మేడిపల్లి సత్యం హల్చల్.. రైతులకు భరోసా!
Gangadhara: గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Gangadhara: మార్కెట్ యార్డులో మేడిపల్లి సత్యం హల్చల్.. రైతులకు భరోసా!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డును చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా యార్డ్‌లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలను స్వయంగా పరిశీలించి, రైతులకు అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు విధానం, తూకం ప్రక్రియ, నిల్వ సదుపాయాలు, త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా రబీ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యార్డ్‌కు అధిక సంఖ్యలో రైతులు ధాన్యం తీసుకువచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమావేశమై, రైతులకు పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులు తమ పంటను సకాలంలో విక్రయించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


