Rajanna Sircilla: మిడ్ మానేరు తాజా అప్‌డేట్.. తగ్గుతున్న నీటి మట్టం!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటి మట్టం వివరాలు. కొదురుపాక వద్ద రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.532 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 15 April 2026 7:10 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేరు తాజా అప్‌డేట్.. తగ్గుతున్న నీటి మట్టం!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఉదయం 6 గంటల సమయానికి నీటి నిల్వలపై తాజా వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం +307.96 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుత సామర్థ్యం 27.55 టీఎంసీలలో 8.532 టీఎంసీలుగా ఉంది.

రిజర్వాయర్‌లోకి ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP), ఎస్‌వైపీ (GPH) ద్వారా కూడా నీటి ప్రవాహం నిలిచిపోయింది. మానేర్, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా వరద ప్రవాహం నమోదు కాలేదు. అయితే, రిజర్వాయర్ నుండి మొత్తం 1135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో రైట్ సైడ్ కాలువ (R/S) ద్వారా 500 క్యూసెక్కులు, రైట్ మైన్ కాలువ (RMC) ద్వారా 450 క్యూసెక్కులు, లెఫ్ట్ మైన్ కాలువ (LMC) ద్వారా 5 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. అదనంగా ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, MB ద్వారా 45 క్యూసెక్కుల నీటి నష్టం నమోదవుతోంది.

ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు ఏవీ ఎత్తలేదు. అయితే రైట్ సైడ్ గేట్లలో 4లో 2 గేట్లు (గేటు నంబర్లు 2, 3) 0.4 మీటర్ల ఎత్తులో తెరిచి ఉంచారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story