Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ సాగునీటి కోసం గేట్లు ఎత్తివేత!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి మట్టం 10.09 టీఎంసీలుగా ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 12:12 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ సాగునీటి కోసం గేట్లు ఎత్తివేత!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం గురువారం ఉదయం 6 గంటలకు 309.13 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 27.55 టీఎంసీలకుగాను ప్రస్తుతం 10.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో పాటు వరద ప్రవాహాలు కూడా నమోదు కాలేదు.

అయితే, సాగునీటి అవసరాల దృష్ట్యా మొత్తం 2635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో రైట్ సైడ్ కాలువ ద్వారా 2000 క్యూసెక్కులు, ఆర్‌ఎంసీ ద్వారా 450 క్యూసెక్కులు, ఎల్‌ఎంసీ ద్వారా 5 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. అదనంగా ఆవిరీభవనం మరియు ఇతర అవసరాల కోసం కొంత నీరు వినియోగంలో ఉంది.

స్పిల్‌వే గేట్లు అన్నీ మూసివేసి ఉండగా, రైట్ సైడ్ గేట్లు నాలుగూ (1, 2, 3, 4) 0.8 మీటర్ల ఎత్తులో తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story