Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ 8.096 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం వివరాలు. 8.096 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లోలు లేవని తెలిపిన అధికారులు.
Rajanna Sircilla: మిడ్ మానేర్ అప్‌డేట్ 8.096 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటి మట్టం ఉదయం 6 గంటలకు 307.60 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 8.096 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు తెలిపారు. ఎస్‌వైపీ (జీపీఎచ్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ, అలాగే మానేర్, మూల వాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు.
అవుట్‌ఫ్లోగా మొత్తం 435 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో రిజర్వాయర్ స్పిల్‌వే ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు, ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు వెలువడుతోంది. రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు ఏవీ ఎత్తలేదు. రేడియల్ స్లూయిస్ గేట్లలో 4 గేట్లకు గాను ఒక గేట్ మాత్రమే తెరిచి ఉంచారు. గేట్ నంబర్ 3ను 0.4 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.




