Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ!
Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ రాశారు. సీనియర్ బీసీ మహిళా నాయకురాలినైన తనపై సామూహిక దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ!
Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ, తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానన్న సురేఖ, తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన, బహిరంగ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
తన వెనుక ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించాలని విజ్ఞప్తి, నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరిన సురేఖ, క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతుండగానే తనపై బహిరంగ విమర్శలు చేయడంపై అభ్యంతరం. తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడాన్ని ప్రశ్నించిన సురేఖ.
క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా? పరిశీలించాలని కోరిన సురేఖ, “సీనియర్ బీసీ మహిళా నాయకురాలినైన నాపై సామూహిక దాడులు జరుగుతున్నాయి” అంటూ ఆవేదన, పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్న సురేఖ, తనపై వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాలను పరిశీలించాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి.
పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారతను కాపాడాలని సూచన, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి.




