Mandipalli: గాలివీడు మండలం ఈతోటి వాండ్లపల్లిలో పర్యటన!

Mandipalli: అన్నమయ్య గాలివీడు మండలానికి చెందిన టీడీపీ నేత బెల్లం వెంకటరమణా రెడ్డిని నివాసంలో పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పూర్తి వివరాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 12:35 PM IST
Mandipalli
X

Mandipalli: గాలివీడు మండలం ఈతోటి వాండ్లపల్లిలో పర్యటన!

Mandipalli: గాలివీడు మండలం ఈతోటి వాండ్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బెల్లం వెంకటరమణా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. టీడీపీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI