Nizamabad: అతివేగం వద్దు - ఆయుష్షు పెంచుకోండి.. మంత్రి హితవు
Nizamabad: నిజామాబాద్‌లో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లాకు కొత్త బస్ డిపో మంజూరు చేస్తున్నట్లు ప్రకటన.
Nizamabad: అతివేగం వద్దు - ఆయుష్షు పెంచుకోండి.. మంత్రి హితవు
Nizamabad: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నిజామాబాద్ శివారులోని సుగుణ గార్డెన్స్ లో పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని, ఎవరికివారు తమవంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు.
ముఖ్యంగా యువకులు, విద్యార్థులు వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. , నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రతిరోజూ 10వేల బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ,
65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు, సీపీ సాయి చైతన్య,నగర మేయర్ ఉమా రాణి, తదితరులు పాలుగోన్నారు.




