Road Safety: స్వయంగా బైక్ నడిపిన రవాణా శాఖ మంత్రి
Road Safety: ఆదిలాబాద్‌లో రోడ్డు భద్రతపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహన ర్యాలీ. స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడిపిన మంత్రి.
Road Safety: స్వయంగా బైక్ నడిపిన రవాణా శాఖ మంత్రి
Road Safety: ట్రాఫిక్ అవగాహన కోసం హెల్మెట్ ధరించిన మంత్రి పొన్నం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వయంగా మంత్రి బైక్ నడిపారు. అనంతరం పలువురికి హెల్మెట్ హెల్మెట్ లను పంపిణీ చేశారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ కి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని.. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వేడ్మ బొజ్జు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story




