Ponnam Prabhakar: రికార్డుల నుంచి తొలగించండి: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై స్పీకర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

Ponnam Prabhakar: తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించిన తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్రం కుట్ర అని ఆయన విమర్శించారు.

Arun Chilukuri
Published on: 18 April 2026 4:54 PM IST
Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: రికార్డుల నుంచి తొలగించండి: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై స్పీకర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

Ponnam Prabhakar: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎన్డీయే ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

"అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను తేజస్వి సూర్య అవమానించడం దుర్మార్గం. సభలో తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తుంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. తేజస్వి సూర్య మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి" అని మంత్రి డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కూడా కేంద్రం రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకే కేంద్రం కుట్రపూరితంగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story