Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు: 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే..

Seethakka: అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై మంత్రి సీతక్క మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 13 April 2026 2:04 PM IST
Seethakka
X

Seethakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు: 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే..

Seethakka: తెలంగాణ రాజకీయాల్లో అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఈ నోటీసులను పంపించారు.

నోటీసులోని ప్రధానాంశాలు:

అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల మొత్తం టెండర్ విలువ కేవలం రూ. 44 కోట్లు మాత్రమేనని, కానీ అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం హాస్యాస్పదమని మంత్రి పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను 'తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్' నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇందులో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఒకవేళ గడువులోగా స్పందించకుంటే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story