Sridhar Babu: వారిద్దరి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది
Sridhar Babu: సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమన్వయంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
Sridhar Babu: వారిద్దరి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది
Sridhar Babu: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య అత్యుత్తమ పరిపాలనా, రాజకీయ సమన్వయం ఉందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజన్, పార్టీ నిర్మాణం ఒకే దిశలో సాగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని తాము భావించినప్పటికీ.. సభకు ముఖం చాటేయాలనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ కావాలని గందరగోళం సృష్టించి సస్పెన్షన్‌కు గురైందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలకు శాసనసభ ప్రజాస్వామ్య నియమావళి అస్సలు నచ్చవని, పదేళ్ల తమ పాలనలో అసెంబ్లీని అతి తక్కువ రోజులు నడిపిన చరిత్ర వారిదేనని ఎద్దేవా చేశారు.
ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా, సుదీర్ఘంగా సభను నిర్వహిస్తుంటే తట్టుకోలేక పారిపోతున్నారని దుయ్యబట్టారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేందుకు బీఆర్ఎస్ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలి చేస్తోందని మండిపడ్డారు.




