Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టులు లేకుండా భూపోరాటాలు లేవు..కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
Kunamneni Sambasiva Rao: తెలంగాణ అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూములు, ధరణి లోపాలపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టులు లేకుండా భూపోరాటాలు లేవు..కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
Kunamneni Sambasiva Rao: శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చలో కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టులు లేకుండా ఎక్కడా భూపోరాటాలు జరగలేదని, 1945 నుంచే కమ్యూనిస్టులు భూమి కోసం పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు.
గత ధరణి పోర్టల్‌లో జరిగిన తప్పిదాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, భూదాన్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ధరణి లోపాల వల్ల ఇబ్బంది పడ్డ 3 లక్షల ఎకరాల ప్రైవేటు భూముల వివరాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, భూదాన్ భూముల వివరాలను బహిర్గతం చేయాలని, భూదాన్ భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
నిజాం హయాంలో 'సర్ఫ్‌ఖాన్' పేరిట హైదరాబాద్‌లో ఉన్న భూములు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. ఆ భూములను వెలికితీస్తే రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
22ఏ విషయంలో జరిగింది సాంకేతిక తప్పిదంగా భావిస్తున్నప్పటికీ, దీనిలో మంత్రులు, అధికారుల పాత్ర ఎంత ఉందో నిగ్గుతేల్చాలని కోరారు.




