Karimnagar: గంగాధరలో ఘనంగా అంబేద్కర్ జయంతి.. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక దృశ్యాలు. పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 14 April 2026 11:07 AM IST
Karimnagar
X

Karimnagar: గంగాధరలో ఘనంగా అంబేద్కర్ జయంతి.. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే!

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై వేడుకలకు శోభ చేకూర్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సంఘం నాయకులు సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన సమానత్వ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి అపారమని, సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబటి రజిత ఎంపీడీవో ధమ్మని రాము మధురానగర్ సర్పంచ్ వేముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story