గ్రామ సమాచారం ఇక వేలిముద్రపై.. ‘మన విలేజ్ యాప్’ ప్రారంభించిన ఎమ్మెల్యే

Kodurupaka: రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందించే 'మన విలేజ్ యాప్'ను ప్రారంభించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 19 April 2026 7:07 PM IST
Kodurupaka
X

గ్రామ సమాచారం ఇక వేలిముద్రపై.. ‘మన విలేజ్ యాప్’ ప్రారంభించిన ఎమ్మెల్యే

Kodurupaka: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టనున్న వివిధ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామ ప్రజలకు సాంకేతిక సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన “మన విలేజ్ యాప్” ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ యాప్ ద్వారా గ్రామ ప్రజలు వివిధ ప్రభుత్వ సేవలు, గ్రామ సమాచారం, సమస్యల పరిష్కారం వంటి అంశాలను సులభంగా పొందగలరని ఎమ్మెల్యే తెలిపారు. డిజిటల్ గ్రామాల నిర్మాణంలో ఇటువంటి యాప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story