Kodimial: గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యం.. ఎమ్మెల్యే సత్యం
Kodimial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పర్యటించారు.
Kodimial: గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యం.. ఎమ్మెల్యే సత్యం
Kodimial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. మండలంలోని నమిలికొండ, పూడూరు, తిర్మలాపూర్, సురంపేట గ్రామాల్లో మహిళా స్వశక్తి సంఘాల నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ భవనాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే చింతలపల్లి, కోనాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు గ్రామ పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దమ్మయ్యపేట గ్రామంలో మహిళా గ్రామ సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, అదే గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి, మహిళల శక్తివంతీకరణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా డా. మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


