Karimnagar: బండి సంజయ్‌ను కలిసిన మేడిపల్లి సత్యం.. NH 563 పనులు వేగవంతం చేయండి!
Karimnagar: కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి (NH 563) పనులను వేగవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరారు.
Karimnagar: బండి సంజయ్‌ను కలిసిన మేడిపల్లి సత్యం.. NH 563 పనులు వేగవంతం చేయండి!
Karimnagar: కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH 563) పనులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో వాటి పురోగతిని వేగవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన డిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్–జగిత్యాల రహదారి ప్రాంత ప్రజలకు అత్యంత కీలకమని, రహదారి పనులు ఆలస్యమవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచనలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.




