MLA Raja Singh: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ చిచ్చు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రాజాసింగ్!
MLA Raja Singh: తెలంగాణలోని ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు 'కల్మా' హోంవర్క్‌గా ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
MLA Raja Singh: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ చిచ్చు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రాజాసింగ్!
MLA Raja Singh: తెలంగాణలో ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు 'కల్మా' హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదాస్పద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులకు ఇలాంటి హోంవర్క్‌లు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. కొన్ని శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనే స్కూళ్ళు, కాలేజీలు, మాల్స్, అలాగే హిందూ సముదాయాలపై ఈ విధంగా దాడులు, ప్రయోగాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది?" అంటూ ఆయన అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన రుద్దుడు ఏంటని నిలదీశారు.
ఈ వివాదానికి కారణమైన సదరు పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.




