Sanjay Kumar: తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చిన ఎమ్మెల్యే సంజయ్.. బీజేపీలోకి హరీష్‌రావు?
Sanjay Kumar: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. హరీష్‌రావు బీజేపీలో చేరబోతున్నారని, ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆరోపణ.
Sanjay Kumar: తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చిన ఎమ్మెల్యే సంజయ్.. బీజేపీలోకి హరీష్‌రావు?
Sanjay Kumar: తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడాన్ని హరీష్‌రావు సహా పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. "ఉద్యమకారులను అణిచివేసిన వ్యక్తి పార్టీలోకి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నచ్చడం లేదు. జీవన్ రెడ్డి వస్తే బీఆర్ఎస్ చీలిపోతుందని వారు భయపడుతున్నారు" అని సంజయ్ పేర్కొన్నారు.
హరీష్‌రావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటంపై సంజయ్ స్పందిస్తూ.. "బీజేపీ పెద్దలను కలిసేందుకే హరీష్‌రావు ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు జతకట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌లోనే ఉండి పోరాడదామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా, హరీష్ మాత్రం తన దారి తాను చూసుకుంటున్నారు" అని సంచలన ఆరోపణలు చేశారు.
జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు హరీష్‌రావుతో టచ్‌లో ఉన్నారని, పార్టీలో ఏర్పడిన ఈ అంతర్గత విభేదాల వల్ల బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. ఒకవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలోనే ఎమ్మెల్యే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




