Hyderabad: ముంపు కష్టాలకు చెక్.. కమలానగర్ లో ఎమ్మెల్యే పర్యటన!

Hyderabad: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కమలానగర్ కాలనీ సమస్యలపై అధికారులతో సమీక్షించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 April 2026 5:17 PM IST
Hyderabad
X

Hyderabad: ముంపు కష్టాలకు చెక్.. కమలానగర్ లో ఎమ్మెల్యే పర్యటన!

Hyderabad: వారం రోజుల క్రితం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు అట్టి కాలనీ నందు పర్యటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా క్యాంపు కార్యాలయంలో అట్టి కాలనీవాసులను మరియు అధికారులను పిలిపించి సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ చేపడుతున్న బాక్స్ డ్రైన్స్ పనులను త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. అదేవిదంగా అక్కడ సివరేజ్ పనుల సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయాలనీ సూచించారు. బాక్స్ డ్రైన్స్ నందు సివరేజ్ వాటర్ కలవడం జరుగుతున్న నేపథ్యంలో సివరేజ్ వాటర్ కలవకుండా చూడాలని సూచించారు.

అట్టి బాక్స్ డ్రైన్స్ పనుల్లో భాగంగా కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా పనులు సక్రమంగా చేసే విధంగా ప్రణాళికలు చేయాలనీ సూచించారు. అదే విధంగా వైభవ్ టిఫిన్ సెంటర్ నుండి చైతన్యపూరి నాలా వరకు కొత్తగా నూతన బాక్స్ డ్రైన్స్ కోసం గతంలో ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇప్పుడు అవి టెండర్ దశలో ఉన్న నేపథ్యంలో టెండర్లు త్వరగా పూర్తి చేసి బాక్స్ డ్రైన్స్ పనులు ప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు. అట్టి పనులు సకాలంలో పూర్తి అయితే చుట్టుపక్కల ఉన్న కమలానగర్ తదితర కాలనీవాసులకు వర్షపు నీటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గడ్డిఆన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్,అధికారులు విజయ్ కుమార్, మమత, కాలనీవాసులు నర్సింహా రావు, ఆనంద్, ప్రకాష్, గోపాల్, శ్రీనివాస్, ప్రభాకర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story