Armoor: అవినీతికి తావులేదు.. అక్రమ కట్టడాలపై ఎమ్మెల్యే సీరియస్!
Armoor: పట్టణ అభివృద్ధి, అవినీతి నిర్మూలనపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.
Armoor: అవినీతికి తావులేదు.. అక్రమ కట్టడాలపై ఎమ్మెల్యే సీరియస్!
Armoor: పట్టణంలో ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైం లో అన్ని వార్డులకు రోడ్డు వేయడం జరిగింది, అది పట్టణ ప్రజలకు తెలిసిన విషయమే, కానీ కొన్ని వార్డులలో రోడ్లు సగం వరకే అక్కడికి ఆగిపోయాయి, ఈ విషయంపై ప్రజలు ఎవ్వరు కూడా ఆ సంతృప్తి పడకండి, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది, వాళ్లు వెంటనే స్పందించి మొత్తం రోడ్లను పనులను పూర్తిగా క్లియర్ చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇవ్వడం జరిగింది.
రోజురోజుకి ఎండలు ఎక్కువ కావడంతో:
ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి సమస్య వచ్చినా గాని, తాగినీరు సమస్య గాని, ఎక్కడ అయితే సమస్య ఉన్నదో, లిమిట్స్ తగ్గించుకొని, అవసరమైన వారికి సరిపరి చేయాలన్నారు, ఎలాంటి ఇబ్బంది రావద్దని అధికారులకు చెప్పడం జరిగింది.
అక్రమాల పై ఎమ్మెల్యే వివరణ:
పట్టణంలో అక్రమాల కట్టడాలపై, కొందరికి ప్రజలకు అక్రమం జరుగుతున్న అన్న విషయాలు ఎమ్మెల్యే దృష్టికి రావడం జరిగింది, దీనిపై వెంటనే స్పందించి ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు, పోలీసులకు మీ ప్రజలకు అన్యాయం చేయకుండా వెంటనే ఏది కరెక్ట్ ఉంటే అది చేయాలంటూ కోరారు.
ఎమ్మెల్యే ప్రజలకు విన్నపం:
నా దృష్టికి అక్రమాల కట్టడాలపై రావడం జరిగింది, ప్రజలు ఎవరు కూడా బిల్డింగ్స్ కట్టెటప్పుడు గాని, సరైన పర్మిషన్ తీసుకొని, ఉన్నంత ప్రజలలో ఇల్లు కట్టుకోవాలని సూచించారు, ప్రజలు ఎవ్వరికి కూడా భయపడకుండా ధైర్యంగా ఏదైనా కట్టుకోవడానికి, ఏవైతే రూల్స్ ఉంటాయో, ఆ రూల్స్ ని ఫాలో చేస్తూ ముందుకెళ్లాలంటూ ఏ కౌన్సిలర్ కానీ,
మున్సిపల్ అధికారులకు కూడా కానీ, ఎలాంటి పైసలు ఇవ్వక్కర్లేదు, చక్కా పర్మిషన్ డెవలప్మెంట్ చార్జెస్ కొరకు తీసుకోండ్రి, ఎలాంటి రాజకీయ నాయకుడికి గాని అధికారులకు గాని లొంగకండి, సరిగా కట్టుకుంటే అది మీకే చాలా మంచిది, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన గాని, మీరు వెంటనే నా నంబర్ కాల్ చేసి మీ యొక్క సమస్యను చెప్పుకోవాలంటూ, ఎమ్మెల్యే ప్రజలకు బహిరంగంగా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది.
కొంతమంది రిపోర్టర్ల పై ఎమ్మెల్యే:
పట్టణంలో కొంతమంది రిపోర్టర్లు, రిపోర్టర్ల ముసుగులో ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైతే జెన్యూ గా మంచిగా పని చేసుకుంటున్నారు మీరే అటువంటి కల్ప ముక్కల్ని ఏరేయండి, కొంతమంది రాజకీయాలు నాయకులను పట్టుకొని విలేకరుల ముసుగులో యజమాలను బెదిరించడం, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, అధికారులు చూపించడం, విలేకరులపై కంప్లైంట్స్ వస్తున్నాయి,
ప్రత్యేకంగా విలేకరులకు విన్నపం విలేకరుల ముసుగులో అలా చేయడం జెన్యూన్ గా ఉన్న రిపోర్టర్స్ కి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరే గుర్తించుకొని కరెక్ట్ గా పని చేసుకోవాలన్నారు, విలేకరుల దృష్టికి ఏవైనా విషయాలు వస్తే, మీరు నాకు ఎప్పుడు 24/7 ఎల్లవేళలా ఫోన్ చేయొచ్చు అన్నారు, మన నియోజవర్గంలో అన్ని లీగల్ గా నడుస్తున్నాయి, ఎక్కడైతే అవినీతిని నడుస్తుందో అవి నా దృష్టికి తీసుకొస్తే, నేను అక్కడికి విసిట్ చేసి, నేను సరిదిస్తాను అన్నారు,కాబట్టి ఇలానే నడిపించుకుందాం, మన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకెళ్దాం అంటూ మాట్లాడాడు.




