Telangana: దిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం!

Telangana: దిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ కోదండరాం. అంబేడ్కర్ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు రేపు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటన.

G. Govind, Medchal
Published on: 7 Oct 2026 6:07 PM IST
Telangana
X

Telangana: దిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం!

Telangana: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం దిల్లీలో నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం ప్రధాన ప్రతిపక్షనేత, ఇండియా కూటమిలో కీలక బాధ్యత రాహుల్ గాంధీ వహిస్తున్నారు ఇండియా కూటమి ఎంపీలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం సరైంది కాదు ఎస్ఐఆర్ లో అవకతవకల రీత్యా దాన్ని రద్దు చేయాలి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం కావాలని నిర్ణయించుకున్నాం

ఓటు వేసే అధికారాన్ని అణిచివేయడం.. ఓట్లు తొలగించడం సమంజసం కాదు ఎన్నికల కమిషన్ పని చేయకుండా.. కమిషన్ పేరుతో నిర్ణయాలు జరగడం శోచనీయం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఓట్లు తొలగిస్తున్నారు రేపు అంబేద్కర్ విగ్రహం నుంచి లోక్ భవన్ కు వరకు ర్యాలీ నిర్వహిస్తాం పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీకి రావాలి ఓట్లు తొలగించే ప్రక్రియను అందరం కలిసి ఎదుర్కోవాలి

ఆర్టీసీ ఎన్నికల్లో అశ్వద్ధాం రెడ్డి కూటమికి మద్దతు ఇస్తున్నాం తెలంగాణ జన సమితి నూతన కమిటీని ప్రకటించిన కోదండరాం అధ్యక్షుడిగా కోదండరాం మరోసారి ఎన్నిక ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్ రావు, అంబటి శ్రీనివాస్, భద్రుద్దీన్, ధర్మార్జుణ్ ఎన్నిక ప్రధాన కార్యదర్శులుగా గోపగాని శంకర్, గోలి సత్యనారాయణ, ఆశప్ప, బైరీ రమేష్, నిజ్జన రమేష్... కోశాధికారిగా పల్లె వినయ్ కుమార్ నియామకం..

G. Govind, Medchal

G. Govind, Medchal