MLC Kodandaram: పేపర్ లీక్‌లపై మండిపడ్డ కోదండరామ్.. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం!
MLC Kodandaram: విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు ప్రకటించారు.
MLC Kodandaram: పేపర్ లీక్‌లపై మండిపడ్డ కోదండరామ్.. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం!
MLC Kodandaram: దేశంలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు చేపట్టిన ‘మహాధర్నా’కు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఢిల్లీలో సిజెపి (CJP) నేతలను కలసి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు అత్యంత న్యాయమైన డిమాండ్లతో రోడ్లపైకి వచ్చారని, పరీక్షలను సక్రమంగా నిర్వహించి వారి భవిష్యత్తును కాపాడాలని కోదండరామ్ స్పష్టం చేశారు.
నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) సహా దేశవ్యాప్తంగా దాదాపు 150 రకాల పరీక్షలు అస్తవ్యస్తంగా, గందరగోళంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వరుస పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక తీవ్ర అయోమయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
దేశంలో పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు.
పేపర్ లీకేజీకి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"విద్యార్థుల ఆందోళన అత్యంత శాంతియుతంగా, చట్టబద్ధంగా జరుగుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యవాదులంతా విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలవాలి." అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.




