Tandur: తాండూరు భద్రేశ్వరాలయం వద్ద వైభవంగా గణపతి వేడుకలు!

Tandur: తాండూరు భద్రేశ్వర ఆలయం వద్ద హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 14 Sept 2026 3:04 PM IST
Tandur
X

Tandur: తాండూరు భద్రేశ్వరాలయం వద్ద వైభవంగా గణపతి వేడుకలు!

Tandur: ఆది పూజ్యుడైన గణనాథుని కృపాకటాక్షాలు తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిపై ప్రసాదించాలని ఆ దిశగా తాను ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శాసనమండలి ప్రభుత్వ చీప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

సోమవారం వినాయక చవితిని పురస్కరించుకొని భద్రేశ్వర దేవాలయ సమీపంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన విజ్ఞనాధునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 30 సంవత్సరాల నుండి భద్రేశ్వర స్వామి దేవాలయ సమీపంలో విజ్ఞనాధుని ప్రతిష్టించి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.

ప్రతి సంవత్సరం తాండూరు పట్టణ వ్యాప్తంగా నిరాటంకంగా హిందూ ఉత్సవ కమిటీ చేస్తున్న సేవలు హర్షించదగ్గరన్నారు. భవిష్యత్తులో హిందూ ఉత్సవ కమిటీ తమ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

తెలంగాణ ఉత్సవ సమితి కి కావలసిన భూమి విషయంలో తాను తన వంతు సహకారం అందిస్తానన్నారు. అంతకుముందు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులను వారు చేస్తున్న మహత్తర కార్యక్రమాలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur