Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 'కేదార్' మిస్టరీ.. రోహిత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి సోదరులకు మరియు దుబాయ్‌లో మరణించిన కేదార్‌కు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 'కేదార్' మిస్టరీ.. రోహిత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
Moinabad Drugs Case: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ విచారణలో 'కేదార్' అనే వ్యక్తి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మరణించిన కేదార్‌కు, పైలట్ రోహిత్ రెడ్డి సోదరులతో ఉన్న సంబంధాలపై పోలీసులు దృష్టి సారించారు.
రోహిత్ రెడ్డి మరియు అతని సోదరుడు రితేష్ రెడ్డి బ్యాంక్ ఖాతాల నుండి కేదార్‌కు రూ. 25 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చాలామంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు నిందితులు పలుమార్లు డబ్బులు పంపినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. కేదార్‌తో ఉన్న సంబంధాలు మరియు ఆ రూ. 25 లక్షల లావాదేవీ గురించి ప్రశ్నించగా, రోహిత్ రెడ్డి మరియు రితేష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పోలీసులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు.
దుబాయ్‌లో మరణించిన కేదార్‌తో వీరికి ఉన్న వ్యాపార లేదా వ్యక్తిగత సంబంధాలు ఏమిటనే కోణంలో లోతైన విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు విచారణకు సహకరించడం లేదని, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి మరియు ఈ ఆర్థిక మూలాలను కనుగొనడానికి మరికొంత కాలం కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.




