Mahabubnagar: 2029 నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళల రాజ్యమే!

Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో మహిళా బిల్లుకు మద్దతుగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 8:56 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: 2029 నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళల రాజ్యమే!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహిళా బిల్లుకు మద్దతుగా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎంపీ డీకే అరుణ నేతృత్వం వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బిల్లుకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ఈ నెల 16న మహిళా బిల్లు పార్లమెంటులో చర్చకు రానుందని తెలిపారు.

పార్టీలు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. సమాజంలో మహిళలు 50 శాతం ఉన్నారని, వారికి పాలించే శక్తి, రాణించే సామర్థ్యం ఉన్నదని అన్నారు. నారి శక్తి ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. 2029 నాటికి ఈ బిల్లు అమలులోకి వస్తే అసెంబ్లీ, పార్లమెంట్‌లలో 33 శాతం మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story