Raghunandan Rao: కొండా సురేఖకు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్: "జై సోనియా అంటే మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి?"
Raghunandan Rao: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయనడం అవివేకమని, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Raghunandan Rao: కొండా సురేఖకు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్: "జై సోనియా అంటే మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి?"
Raghunandan Rao: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు 'జై శ్రీరామ్' అంటే డబ్బులు వస్తాయని అనడం సురేఖ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నైజమే హిందూ వ్యతిరేకత అని ఆయన విమర్శించారు.
"జై శ్రీరామ్ అంటే మాకు డబ్బులు వస్తాయని మాట్లాడుతున్నారు.. మరి మీరు జై సోనియా, జై రాహుల్ అంటే మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి?" అంటూ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. హిందూ దేవుళ్లపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత వివక్ష అని ఆయన ప్రశ్నించారు. గతంలో దేవుళ్లు లేరు అన్న మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారు నేడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారని, దేవుడిని తక్కువ చేసి మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.




