Adilabad: అభిమానానికి ఆర్గానిక్ బ్రాండ్ కేసీఆర్-కేటీఆర్ మామిడి తోట
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కె) గ్రామస్తులు తమ రాజకీయ ప్రేమాభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
Adilabad: అభిమానానికి ఆర్గానిక్ బ్రాండ్ కేసీఆర్-కేటీఆర్ మామిడి తోట
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కె) గ్రామం మరోసారి తన రాజకీయ ప్రేమాభిమానాన్ని చాటుకుంది. నాలుగేళ్ల క్రితం కేసీఆర్, కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నాటిన 500 మామిడి మొక్కలు నేడు కాయలు కాసి పలకరిస్తుంటే, ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కేవలం మొక్కలు నాటడమే కాకుండా, ఆ తోటకు “కేసీఆర్-కేటీఆర్ ఆర్గానిక్ మాంగో ఫామ్” అని పేరు పెట్టి, ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించారు. ఈగలు, ఇతరత్ర క్రిమికీటకాల వల్ల కాయలు కుళ్ళిపోకుండా ఉండేందుకు, ప్రతి మామిడి కాయకు ప్రత్యేకమైన కవర్లు తొడిగి అత్యంత శ్రద్ధగా సంరక్షిస్తున్నారు.
ఎటువంటి రసాయన మందులు వాడకుండా, స్వచ్ఛమైన సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ తొలి పంటను కేసీఆర్, కేటీఆర్‌లకే స్వయంగా అందజేస్తామని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మరియు ఎంపీటీసీ సుభాష్ అన్నారు.
గ్రామంలో ఏ చిన్న వేడుక జరిగినా కేసీఆర్ ఫోటో ఉండాల్సిందేనని, గతంలో 'టీంగు టీంగు' మంటూ మొబైల్‌కు వచ్చే రైతుబంధు మెసేజ్ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు అసలైన గౌరవం దక్కిందని, మళ్ళీ ఆ సువర్ణ యుగం రావాలని ముఖరా (కె) ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.




