POCSO Case: ములుగు జిల్లాలో సంచలన తీర్పు: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
POCSO Case: ములుగు జిల్లాలో నమోదైన ఓ పోక్సో కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ సంచలన తీర్పునిచ్చారు.
POCSO Case: ములుగు జిల్లాలో సంచలన తీర్పు: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
POCSO Case: కన్నెబోయిన సమ్మయ్య అనే నిందితుడిపై ఇటివల నమోదైన పోక్సో కేసులో ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ సంచాలన తీర్పును ఇచ్చింది. నిందితుడుకి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించిందని SP సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. అలాగే బాధితురాలికి వెంటనే 10 లక్షల నష్టపరిహారం అందించాలని వెల్లడించారు.
అదే విధంగా నిందితుడుకి శిక్ష పడే విధంగా కృషిచేసిన, పోలీస్ అధికారులను, కోర్టు అధికారులను, అభినందించారు. మైనర్ పిల్లలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడానికి ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని SP సుధీర్ రాంనాథ్ స్పష్టం చేశారు.
Next Story




