Gangadhara: మా జనాభాను ఎందుకు తగ్గించారు? ప్రభుత్వానికి కాపుల నిలదీత
Gangadhara: కులగణన సర్వేలో మున్నూరు కాపులను బీసీలలో నాలుగో స్థానంలో చూపించడాన్ని చొప్పదండి నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.
Gangadhara: మా జనాభాను ఎందుకు తగ్గించారు? ప్రభుత్వానికి కాపుల నిలదీత
Gangadhara: మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వేలో బీసీలలో నాలుగో స్థానంలో చూపించడాన్ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గంగాధర మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులను తక్కువ జనాభాగా చూపించడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు,
గత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో మున్నూరు కాపులను మొదటి స్థానంలో చూపించారని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు. ఇది మున్నూరు కాపుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నమని అన్నారు.
అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వం మున్నూరు కాపులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకుండా ఉండడం కూడా బాధాకరమని విమర్శించారు. మున్నూరు కాపుల వంటి పెద్ద సామాజిక వర్గానికి మంత్రి పదవిలో స్థానం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మళ్లీ కులగణన సర్వే చేపట్టి నిజమైన జనాభా వివరాలను బయటపెట్టాలని, అలాగే మంత్రివర్గంలో మున్నూరు కాపులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు మాజీ సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, మాజీ వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, వార్డు సభ్యులు గంట కిషన్, దొడ్ల ఎల్లారెడ్డి, నాయకులు గంట రమేష్, గంట హరీష్, రాంశెట్టి తిరుపతి, పులిచెర్ల లక్ష్మీనరసయ్య, గంట లచ్చయ్య, దేశెట్టి మల్లారెడ్డి, దేశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




