Karimnagar: ఎల్లమ్మ గుడికి ముస్లిం సోదరుల భారీ విరాళం

Karimnagar: రామడుగులో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ గుడి ప్రహరీ నిర్మాణానికి అబ్దుల్ అజీజ్ కుటుంబం రూ. 3 లక్షల విరాళం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 14 April 2026 5:38 PM IST
Karimnagar
X

Karimnagar: ఎల్లమ్మ గుడికి ముస్లిం సోదరుల భారీ విరాళం

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణానికి కుల మతాలకు అతీతంగా గని బాయ్ కుటుంబ సభ్యులు ఉదారంగా ముందుకు వచ్చారు.

గోపాల్ రావుపేటకు చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, ఆయన సోదరులు హనీఫ్ తదితరులు తమ తాతగారి జ్ఞాపకార్థం ఆలయ నిర్మాణానికి రూ. 3,00,000 (మూడు లక్షల రూపాయలు) విరాళంగా అందజేస్తామని ప్రకటించారు. యాకూబ్ టెంట్ హౌస్‌కు చెందిన ఖదీర్ కుమారులు ఈ సేవ కార్యక్రమంలో భాగస్వాములు కావడం విశేషం.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముస్తాక్, వసీం, కలీం, మాజీ సర్పంచ్ పంజాల జగన్, గౌడ సంఘం అధ్యక్షుడు గోనెపల్లి రాజయ్య, అనుపురం రాజయ్య, పూరేళ్ల మనోజ్, పరశరాములు, తిరుపతి, మూల శ్రీను, గుర్రం శ్రీకాంత్, శంకరయ్య, పూరేళ్ల శేఖర్, రాయమల్లు తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఈ విరాళం పట్ల రామడుగు గౌడ సంఘం సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆలయ నిర్మాణానికి అందరూ ఇలానే సహకరించాలని కోరారు. శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని వారు ఆకాంక్షించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story