Narsapur: వేగం కన్నా ప్రాణం ముఖ్యం.. సురక్షిత ప్రయాణంపై ప్రతిజ్ఞ

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సదస్సు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ జాన్ రెడ్డి పిలుపు.

G Ashok Reddy, Narsapur
Published on: 13 April 2026 2:35 PM IST
Narsapur
X

Narsapur CI Jan Reddy Urges Public to Follow Traffic Rules

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ని కాగజ్ మద్దూర్ గ్రామం లో డీజీపీ మరియు మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన పట్టణ ప్రగతి 99 కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రయాణం పట్ల ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను ప్రజలచేత ప్రమాణం చేయించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని సీఐ జాన్ రెడ్డి అందరికి సూచించారు..

నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని,

ప్రమాదం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని, దృఢసంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డితోపాటు పోలీస్ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ శివకుమార్ brs నాయకులు భోగ శేఖర్ తో మత్తు కాగజ్ మద్దూర్ గ్రామస్తులు పాల్గొన్నారు..

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story