చాక్లెట్ ఆశచూపి చిన్నారుపై అఘాయిత్యం.. నార్సింగిలో కామాంధుడి ఘాతుకం!

రాజధాని శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలవిసే దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 16 March 2026 3:45 PM IST
చాక్లెట్ ఆశచూపి చిన్నారుపై అఘాయిత్యం.. నార్సింగిలో కామాంధుడి ఘాతుకం!
X

చాక్లెట్ ఆశచూపి చిన్నారుపై అఘాయిత్యం.. నార్సింగిలో కామాంధుడి ఘాతుకం!

హైదరాబాద్ (నార్సింగి): రాజధాని శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలవిసే దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఇప్పిస్తానని ఆశచూపిన ఒక కామాంధుడు.. ఆరేళ్ల పసిగుడ్డుపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై ప్రాణాలు తీశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నిన్న సాయంత్రం నుంచి అదృశ్యం

పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక నిన్న సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హంతకుడిని పట్టించిన సాంకేతిక ఆధారాలు

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి బాలికను నమ్మించి తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి సమాచారంతో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పసిపాపపై జరిగిన ఈ ఘాతుకంతో బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story